News January 18, 2026

HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

image

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.

Similar News

News March 28, 2026

అనిరుధ్‌తో కావ్యా మారన్ పెళ్లి?

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వారు డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. వారిద్దరూ కలిసి కనిపించడం, SRHకు సాంగ్ కంపోజ్ చేయడం దీనికి బలాన్ని చేకూర్చాయి. అనిరుధ్ గతంలో ఆ వార్తలను ఖండించినప్పటికీ వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందంటూ తాజాగా తమిళ మీడియా పేర్కొంటోంది.

News March 28, 2026

మలబద్ధకమా? ఈ టిప్స్ మీ కోసమే

image

వైద్యపరంగా వారానికి మూడు కంటే తక్కువసార్లు విసర్జన అవుతుంటే దాన్ని మలబద్ధకంగా భావిస్తారు. ఎక్కువ రోజులు ఈ సమస్య ఉంటే పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, అవిసె గింజలు, సబ్జా, యోగర్ట్ వంటి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు 8-10 గ్లాసుల నీరు తాగాలి. రోజూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
Share It

News March 28, 2026

కాకినాడ: ఆన్‌లైన్ అప్పులు కట్టలేక MBA స్టూడెంట్ ఆత్మహత్య

image

గండేపల్లి మండలం సూరంపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్‌లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) ఓ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పు ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక మనస్తాపానికి గురై తన గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.