News January 18, 2026

HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

image

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.

Similar News

News April 6, 2026

హైదరాబాద్‌లో నేడు అక్కడక్కడ చిరు జల్లులు

image

హైదరాబాద్‌లో ఇవాళ పాక్షిక మేఘావృతమైన వాతావరణం ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37℃, కనిష్ఠం 26℃ వరకు నమోదు కానుందని, వాయవ్య దిశ నుంచి గంటకు 4- 6 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News April 6, 2026

HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

image

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్‌గా, ఓపెన్ జిమ్‌గా మార్చితే సరి. మీరేమంటారు?

News April 6, 2026

ఇగ అంతా HYD 2.0 నయా స్టైల్!

image

నగర యువత టేస్ట్ ఇప్పుడు ‘HYD 2.0’ వైపు మళ్లింది. రెస్టోబార్ల నుంచి కేఫీల వరకు అంతా నాటు రుచులకు మోడ్రన్ టచ్ ఇస్తున్నారు. ఇక్కడ ‘మైండ్‌ఫుల్ ఇండల్జెన్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఇష్టమైనవి తింటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం. అందుకే షుగర్ బదులు మాంక్ ఫ్రూట్, స్టివియా వాడుతున్నారు. మందు లేని కాక్‌టెయిల్స్, గట్-హెల్త్ పెంచే Matcha డ్రింక్స్‌తో పాటు ఇన్‌స్టా రీల్స్ కోసం సమ్మర్ కూలర్స్ ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్!