News January 10, 2026

HYDలో ఫ్యూచర్ సిటీ.. ‘పంచాయతీ’ పవర్ కట్!

image

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ స్కెచ్ వేసి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లకపోగా, గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే కట్టబెట్టింది. భూములపై పూర్తి పట్టుకోసమే ఈ ‘సూపర్ బాడీ’ని తెచ్చారని, అభివృద్ధి ముసుగులో పల్లెగొంతు నొక్కేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

Similar News

News February 20, 2026

రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

image

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.

News February 20, 2026

HYD: రోజుకు ₹70తో ఇవన్నీ సాధ్యమా?

image

అమీర్‌పేట్ సర్కార్ హోమ్లోని 505 మంది ఇన్‌మేట్స్ కోసం రూ.1.27CRతో మెనూ సిద్ధమైంది. ఆదివారం చికెన్, నిత్యం రాగిజావ, పల్లీలడ్లు, పండ్లు, గుడ్లు ఇవన్నీ రాజభోగంలా ఉన్నా.. నెలకు ఒక్కరికి కేటాయించింది ₹2,100 మాత్రమే. అంటే రోజుకు ₹70 అన్నమాట. దీంతో ఇది సాధ్యమేనా? అన్నది అసలు ప్రశ్న. గుడ్డు ₹6, పాలు లీటర్ ₹85- 90, గ్యాస్ దాదాపు ₹2వేలు సర్కార్ ఫిక్స్ చేసిన ₹70తో ఇవ్వన్నీ అందించడం కత్తిమీద సామే.