News January 10, 2026
HYDలో ఫ్యూచర్ సిటీ.. ‘పంచాయతీ’ పవర్ కట్!

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ స్కెచ్ వేసి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లకపోగా, గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే కట్టబెట్టింది. భూములపై పూర్తి పట్టుకోసమే ఈ ‘సూపర్ బాడీ’ని తెచ్చారని, అభివృద్ధి ముసుగులో పల్లెగొంతు నొక్కేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
Similar News
News February 16, 2026
రావికంపాడు ROB పనులపై MP ఉదయ్ కీలక ఆదేశం

రావికంపాడు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి నిధుల మంజూరు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కాలపు ప్రయాణ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు.
News February 16, 2026
ఈనెల 20 నుంచి అహోబిలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం CAO వీఎల్ఎన్ రామానుజన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎగువ అహోబిలంలో 22న ధ్వజారోహణం, 28న కళ్యాణం తదితర వాహన సేవలు, దిగువ అహోబిలంలో 23న ద్వజారోహణం, మార్చి 1న కళ్యాణం, 3న రథోత్సవం, 4న గరుడసేవ తదితర వాహన సేవలు ఉంటాయన్నారు.
News February 16, 2026
₹1.28లక్షల కోట్ల బంగారం మాయం కాలేదు: FACT CHECK

ఆర్బీఐ ఖజానాలో ఉన్న 880.18టన్నుల బంగారం నుంచి రూ.1.28లక్షల కోట్ల విలువైన గోల్డ్ మాయమైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది. బంగారం నిల్వల విలువ తగ్గినట్లు మాత్రమే RBI ప్రకటించిందని తెలిపింది. ఈ తగ్గుదల మార్కెట్ విలువలో మార్పుల వల్లేనని.. నిల్వల్లోని బంగారం ఎక్కడికీ పోలేదని వివరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.


