News February 9, 2026
HYDలో బండిపోతే ‘బండి’.. ఏమైంది బండి?: CM

నగరంలో వరదలు వస్తే లోతట్టు ఇళ్లు, వాహనాలు మునిగిపోతాయని CM రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వరదల సమస్యను ప్రచారంలో వాడుకున్న బండి సంజయ్ గత GHMC ఎన్నికల్లో దాదాపు 50 మందిని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. కానీ, ‘బండి పోతే బండి ఇస్తాం’ అన్న సంజయ్ ఆ హామీని నీరు గార్చారని, BJPకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.
Similar News
News February 11, 2026
HYD: వాటర్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీరే!

నగరంలో నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ బదిలీ అయ్యారు. హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సామ్రాట్ అశోక్ నామ బదిలీ కాగా, సైబరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎం.సంతోష్ బదిలీ అయ్యారు. లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశికిరణచారి బదిలీ అయ్యారు. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
News February 11, 2026
HYD: హోటల్ గదిలో అన్నాచెల్లెలి మృతదేహాలు

వారణాసి కాంట్ ప్రాంతంలోని సిట్ ఇన్ హోటల్‌లో 4 రోజులుగా బస చేస్తున్న HYD లక్డికాపూల్‌కు చెందిన గణేశ్ గౌడ్, అతడి సోదరి లక్ష్మీదేవి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు గది తలుపులు తెరవకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపు తెరవగా.. ఇద్దరి నోటి నుంచి నురుగు రావడం, అక్కడ విషం ప్యాకెట్ లభించడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2026
GHMCకి ముచ్చటగా ముగ్గురు ఫిక్స్

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించగా వీటికి కొత్త కమిషనర్ల నియామకాలు జరిగాయి. GHMC (సెంట్రల్ HYD) కమిషనర్‌గా ఆర్‌వీ కర్ణన్ కొనసాగుతారు. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన, మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియలో మరో పది మంది IAS అధికారులు బదిలీ అయ్యారు.


