News March 11, 2025

HYDలో బయటకు వెళ్లాలంటే.. గొడుగు పట్టాల్సిందే!

image

గ్రేటర్ HYDలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. నేటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి మొదటివారంలోనే ఇంతటి ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగు పట్టడం తప్పనిసరి అవుతోంది అని వారు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

image

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలటరీలు

image

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: పోలింగ్‌ కోసం 3 వేల మంది ఉద్యోగులు

image

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.