News February 16, 2026

HYDలో ‘బయో ఏషియా 2026’ గర్జన రేపే షురూ

image

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్& హెల్త్-టెక్ సదస్సు ‘బయో ఏషియా 2026ను TG CM రేవంత్ రెడ్డి ఈ నెల 17న సదస్సును అధికారికంగా HITEXలో ప్రారంభించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు, 500కుపైగా కంపెనీలు, 175కు పైగా ఎగ్జిబిటర్లతో భారీ అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. TG రైజింగ్ 2047 విజన్ ద్వారా గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.

Similar News

News February 20, 2026

HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

image

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్‌(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్‌ ఒప్పుకున్నాడు.

News February 20, 2026

హైదరాబాద్‌లో ₹25వేల శాలరీతో జాబ్స్

image

ECIL HYDలో 200 పోస్టులు భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు BTechలో 60% మార్కుల ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 24న ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు ₹25,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/jobopenings చూడండి.

News February 20, 2026

HYD: మోగనున్న పెళ్లి బాజాలు.. వాటికి ఫుల్ డిమాండ్

image

డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను చాలావరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. దీంతో HYD, ఉమ్మడి రంగారెడ్డిలోని ఫంక్షన్ హాళ్లు, వివాహాలకు సంబంధించి కొనుగోళ్లతో వస్త్ర, బంగారు దుకాణాలలో రద్దీ పెరిగింది. ముహూర్తాలు మొదలు కావడంతో డెకరేషన్, ఫొటోగ్రఫి, ఈవెంట్లు నిర్వాహకులు తీరిక లేకుండా ఉన్నారు.