News August 7, 2024
HYDలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు

బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేశారని, వ్యంగ్యంగా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు తీసిన రవి కుమార్(బిత్తిరి సత్తి)పైన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదులో పేర్కొంది.
Similar News
News July 9, 2025
ఘట్కేసర్ వాసుకి ఉత్కృష్ట సేవా పథకం

కేంద్ర ప్రభుత్వ ఉత్కృష్ట సేవా పతకం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన గుండ్యా నాయక్‌ను వరించింది. విధి నిర్వహణలో 15 ఏళ్ల పాటు సేవ, అంకితభావంతో వృత్తి పరమైన నైపుణ్యంతో అనేక విజయాలు సాధించిన ఆయనను ఉత్కృష్ట సేవా పతకం 2025 వరించింది. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
News July 9, 2025
కొంపల్లి రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్ దందా

HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.
News July 9, 2025
మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ ఇచ్చి గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.