News December 19, 2025
HYDలో బ్రెడ్ క్రంబింగ్ ట్రెండ్.. బకరాలు లోడింగ్!

సిటీలో ప్రేమ ‘పెళ్లి’ దాకా వెళ్లడం లేదు.. గాల్లో దీపం పెట్టినట్లే ఉంది. పబ్‌లో పార్టీలు చేసుకుంటూ ఎదుటి మనిషికి అప్పుడప్పుడు ఓ మెసేజ్ పంపి, వాళ్లు రిప్లై ఇస్తే మళ్లీ రెండు రోజులు సైలెంట్ అయిపోవడమే ఈ కొత్త ట్రెండ్. తమ చుట్టూ తిప్పుకోవడానికి వేసే బిస్కెట్లు ఇవి. ఈ ట్రాప్‌లో పడి చాలా మంది మనసులు ముక్కలవుతున్నాయి. సో.. HYD యూత్.. ఆ ‘హాఫ్-హార్టెడ్’ లైకులను చూసి మురిసిపోకండి. బకరాగా మిగలకండి.
Similar News
News December 20, 2025
మన్నెంపల్లిలో వెలుగుచూసిన ‘వీరగల్లు’ శిల్పం

KNR(D)తిమ్మాపూర్(M)మన్నెంపల్లిలో పురాతన యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబించే ‘వీరగల్లు’ శిల్పం లభ్యమైందని పురావస్తు పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. కరణాలగడీ సమీపంలోని పాలకేంద్రం ఆవరణలో చెత్తాచెదారం శుభ్రంచేస్తుండగా ఈ శిల్పం బయటపడింది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తున్న నల్లరాతిపై ఒక సైనికుడు కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో కళ్లెం పట్టుకుని యుద్ధంచేస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది.
News December 20, 2025
షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తాపేశ్వరం విద్యార్థుల జోరు

తాపేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఇంధన పొదుపుపై ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో వీరు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వాకాడ వెంకట రమణ నేతృత్వంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బహుమతులను అందుకున్నారు.
News December 20, 2025
పెద్దపల్లి: రహదారి భద్రతపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం సమీక్ష

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సురక్షిత డ్రైవింగ్ ద్వారా రహదారి ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాల 2026పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నియమాలు పాటించడం, అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు, సీట్ బెల్ట్, హెల్మెట్ పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ప్రతి శాఖ వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.


