News August 27, 2025
HYDలో భారంగా మారనున్న కరెంట్ కనెక్షన్!

ఇకపై కరెంట్ కనెక్షన్ తీసుకోవడం భారంగా మారేలా కనిపిస్తోంది. నగరంలో అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తులు ఉండటం సహజం. అయితే.. కనీసం లోడ్ 1BHK ఫ్లాట్‌కు 2 కిలోవాట్లు, 2BHKకు 5 కిలోవాట్లు, 3BHKకు 10 కిలోవాట్లు, 4BHK అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి 15 కిలోవాట్ల లోడ్ తీసుకోవాలని TGSPDCL జారీ చేసిన ఆదేశాలు కీలకంగా మారనున్నాయి. గతం కంటే ఇవి అధికమని వినియోగదారులంటున్నారు. దీనిపై మీకామెంట్.
Similar News
News September 11, 2025
29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
News September 11, 2025
HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.
News September 11, 2025
HYD: బతుకమ్మకు రావాలని కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ పండుగ జరగనుంది. ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవితకు చింతమడక వాసులు ఆహ్వానం పలికారు. ఎంగిలి పూల బతుకమ్మకు రావాలని సొంత ఊరి నాయకులు, ప్రజలు కోరారు. తప్పకుండా వస్తానని బతుకమ్మ వేడుకలు జరుపుకుందామని ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు.