News July 4, 2025
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభకు INC శ్రేణులు వందలాది వాహనాల్లో తరలివచ్చాయి. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
Similar News
News July 5, 2025
TODAY HEADLINES

☛ 100 MLA, 15 MP సీట్లు గెలుస్తాం: TG CM రేవంత్
☛ వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: AP CM చంద్రబాబు
☛ BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా?: ఖర్గే
☛ మేమెప్పుడూ TDPని తక్కువ చేసి మాట్లాడలేదు: పవన్
☛ కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: BRS
☛ రెడ్ బుక్‌తో AP రక్తమోడుతోంది: YS జగన్
☛ తమిళనాడు: సీఎం అభ్యర్థిగా హీరో విజయ్
☛ రెండో టెస్ట్: ఇంగ్లండ్ ఆలౌట్, సిరాజ్‌కు 6 వికెట్లు
News July 5, 2025
కుర్రాడు ఇరగదీస్తున్నాడు!

INDతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేమీ స్మిత్ అదరగొడుతున్నారు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో 207 బంతుల్లోనే 4 సిక్సర్లు, 21 ఫోర్లతో 184 రన్స్ చేశారు. ఎక్కడా తడబడకుండా అటాకింగ్ బ్యాటింగ్‌తో అదుర్స్ అనిపించారు. తొలి టెస్టులో 84 రన్స్ చేశారు. 24 ఏళ్ల స్మిత్ 2019లో ఫస్ట్ క్లాస్ సెంచరీ బాదారు. గతేడాది టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు.
News July 5, 2025
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై NRPT కలెక్టర్ సమీక్ష సమావేశం

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్‌తో కలిసి అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటర్ల జాబితాలు, భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.