News December 29, 2025

HYD‌లో భారీ అగ్ని ప్రమాదం.. ‘@2వేలు’

image

ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సుమారు 2,000కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతతో సహాయక చర్యలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వాహనాలు, పరికరాల కొరత కూడా సమస్యగా మారింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 30, 2025

NLG: డీసీసీబీ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రైతు సంక్షేమమే DCCB ప్రధాన లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. NLGలో అధికారుల సమావేశంలో ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’పై సమీక్ష జరిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. బ్యాంకు ఆర్థిక పురోగతికి రికవరీలు ముఖ్యమని, క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా సాంకేతిక కమిటీ తీసుకున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేయాలన్నారు.

News December 30, 2025

ఖమ్మం: ఫైల్స్ కదలాల్సిందే.. సమస్య తీరాల్సిందే: అదనపు కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతిపత్రాలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల అలసత్వం వహించవద్దని సూచించారు.

News December 30, 2025

జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ

image

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.