News October 29, 2025

HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

image

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపింది. మీకూ వచ్చాయా?

Similar News

News October 29, 2025

ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుకల నేపథ్యంలో ఐక్యత పాదయాత్ర (యూనిటీ మార్చ్) చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐక్యత పాదయాత్ర నిర్వహణ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటేల్ జయంతి ఉత్సవాల వేడుకలను చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 29, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీనే ప్రత్యామ్నాయం: కిషన్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌కి మద్దతుగా షేక్‌పేట్ డివిజన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలపై మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేశాయని ఓటర్లకు వివరించారు.

News October 29, 2025

HYD: జలమండలి కీలక నిర్ణయం

image

జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో నల్లాల సంఖ్యకు అనుగుణంగా కాకుండా అధిక సంఖ్యలో నీటిని వినియోగిస్తున్నారని తేలడంతో మొత్తం నల్లాలను సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు 700 మందితో రెండు నెలలపాటు సర్వే చేయించనున్నారు. గృహ అవసరాలకు కాకుండా వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగించుకుంటున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈ పకడ్బందీ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత చర్యలకు ఉపక్రమించనున్నారు.