News August 11, 2025
HYDలో భారీ వర్షాలు.. సెలవులు రద్దు

నగరంలో ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. సిటీలో భారీగా వర్షాలు కురిస్తే అత్యవసర పరిస్థితుల్లో అధికారులు విధుల్లో ఉండాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వానాకాలం పూర్తయ్యే వరకు 24 గంటల పాటు విధుల్లో ఉండాలని సూచించారు.
SHARE IT
Similar News
News September 2, 2025
లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
News September 2, 2025
HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
News September 2, 2025
HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.