News August 14, 2025

HYDలో భారీ వర్షాలు.. 9 బోట్లు సిద్ధం

image

భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా 24/7 తమ సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు 51 రంగంలో ఉండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు 150 పని చేస్తున్నాయి. 3,565 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 9 బోట్లను సిద్ధం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

News September 2, 2025

HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

image

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

News September 2, 2025

HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

image

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.