News March 26, 2024
HYDలో మండుతున్న ఎండలు..!

HYDలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. సోమవారం సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.3గా నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌లో 39.6, షేక్‌పేట్‌లో 39.2, అసిఫ్‌నగర్‌లో 38.8, సరూర్‌నగర్‌లో 38.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.
Similar News
News April 3, 2026
HYD: GO.104తో HMDA, FCDAల మధ్య చిక్కుముడి!

GO. నెం.104 ద్వారా ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి కోసం ప్రభుత్వం FCDAను ఏర్పాటు చేసింది. గతంలో HMDA పరిధిలోని మహేశ్వరం, కందుకూరు, ఆమనగల్లు మండలాల పరిధిలోని 74 గ్రామ పంచాయతీలను దీని కిందకు బదిలీ చేశారు. అయితే, పాత సాఫ్ట్‌వేర్ (DPMS) ద్వారానే లేఅవుట్ డెవలప్‌మెంట్ ఫీజులు వసూలవుతన్నాయి. ఈ ఆదాయాన్ని ఏ అకౌంట్స్ హెడ్ కింద జమ చేయాలో తేలక సుమారు రూ.500 కోట్లు ట్రెజరీలోనే నిలిచిపోయాయి.
News April 3, 2026
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మీ అభిప్రాయం ఏంటి..?

తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా ఇబ్బందులను పరిష్కరించడం లాంటివి చేపట్టాల్సి ఉంది. మరీ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కొనసాగుతుండగా మీ ప్రాంతంలో సమస్యలను అధికారులు తీర్చారా..?, మీ వద్దకు వచ్చారా..? మీరు ఇందులో భాగమయ్యారా..? కామెంట్ రూపంలో తెలపండి.
News April 3, 2026
HYDలో పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని టీజీడీపీఎస్ వెల్లడించింది. దుండిగల్, మౌలాలి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల ధాటికి నగరవాసులు అల్లాడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


