News January 27, 2025
HYDలో మరో రైల్వే టెర్మినల్..?
HYDలో మరో రైల్వే టెర్మినల్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. SCR అధికారులు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కెపాసిటీపై సర్వే చేపట్టారు. మల్కాజ్గిరి స్టేషన్ టర్మినల్ చేస్తే, నిజామాబాద్, నాందేడ్ సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. అప్పటి DRM వందన సైతం మల్కాజ్గిరిలో రైల్వే టెర్మినల్ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత చర్యలతో మళ్లీ ఈఅంశం తెరమీదకి వచ్చింది.
Similar News
News January 27, 2025
HYD: భారతమాత హారతి ఆపశ్రుతిపై కేసు నమోదు
హుస్సేన్‌సాగర్ వద్ద నిన్న జరిగిన భారతమాత హారతి ఆపశ్రుతిపై కేసు నమోదైంది. బోటు టూరిజం ఇన్‌ఛార్జ్ ప్రభుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుదాస్ ఫిర్యాదుపై లేక్ పోలీసులు కేసు నమోదు చేశారు. లేక్ పోలీసులు బాణసంచా పేల్చడంపై బోట్లు దగ్ధం కావడంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
News January 27, 2025
HYD: నేడు హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి
HYD బుద్ధభవన్‌లో గల హైడ్రా కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గం. వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలు తదితర అంశాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కాగా.. ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
News January 27, 2025
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నాట్యగురువులు మంజుల రామస్వామి, వీఎస్ రామమూర్తి శిష్యురాలు జీఎస్ విద్యానందిని భరతనాట్య ఆరంగేట్రం ఆదివారం రవీంద్రభారతిలో కనుల పండువగా జరిగింది. పుష్పాంజలి, గణపతి స్తుతి, జతిస్వరం, థిల్లాన వంటి పలు అంశాలపై చక్కటి హావభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞశర్మ, ప్రముఖ కవి రాధశ్రీ, సాంస్కృతిక పండితులు సాధన నర్సింహాచారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.