News October 21, 2025
HYDలో మహిళా శక్తికి రూ. 57 కోట్లతో నాలుగు హాస్టళ్లు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి ప్రాజెక్ట్ మహిళల ఆశలకు ఊపిరి పోస్తోంది. రూ. 57,56,31,404 అంచనా వ్యయంతో HYDలోని ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్‌లో 4 అత్యాధునిక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇవి భరోసా కల్పించనున్నాయి. సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Similar News
News October 21, 2025
HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.
News October 21, 2025
BREAKING: జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో KCR

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి BRS పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రచారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఆయనతో సహా పార్టీ తరఫున ప్రచారంలో 40 మంది ప్రముఖులు పాల్గొంటారు. మాజీ మంత్రులు KTR, హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.
News October 21, 2025
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్‌లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.