News October 21, 2025

HYDలో మహిళా శక్తికి రూ. 57 కోట్లతో నాలుగు హాస్టళ్లు!

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి ప్రాజెక్ట్ మహిళల ఆశలకు ఊపిరి పోస్తోంది. రూ. 57,56,31,404 అంచనా వ్యయంతో HYDలోని ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్‌లో 4 అత్యాధునిక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇవి భరోసా కల్పించనున్నాయి. సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Similar News

News October 21, 2025

ధాన్యం కొనుగోలు పై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలి: అదనపు కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల
ఇన్‌ఛార్జ్‌లకు రెండు రోజులలో ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జ్‌‌లకు ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

News October 21, 2025

సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: నిర్మల్ కలెక్టర్

image

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. www.telangana.gov.in /telanganarising వెబ్ సైట్‌ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరారు.

News October 21, 2025

నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

image

నేవీ చిల్డ్రన్ స్కూల్‌ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్: https://ncsdelhi.nesnavy.in/