News September 11, 2025

HYDలో మా‘రూటే’ సపరేటు..!

image

ఎన్ని నియమాలు పెట్టినా నగరంలో రాంగ్ రూట్‌లో వెళ్లేవారి ధోరణి మారడంలేదు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే.. యూటర్న్, సిగ్నల్స్ వద్ద వచ్చేదే రాంగ్ రూట్‌‌లో ఆపై ఓవర్ స్పీడ్‌. కరెక్ట్ రూట్లో వెళ్లేవారినే కిందపడేస్తుంటారు. మళ్లీ వారితో వాదిస్తుంటారు. ఆటోవాలాలు, బైకర్లు, కార్లతో ఈ నిబంధనలు ఉల్లంఘింస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారపై ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News March 30, 2026

వనపర్తి: ఎస్సీ కార్పొరేషన్ రుణాల గడువు పొడిగింపు

image

ఎస్సీ కార్పొరేషన్ 2025-26 సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు వెబ్‌సైట్: http://tgobmms.cgg.gov.in

News March 30, 2026

అనకాపల్లి: జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీకి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 351 మందికి అక్రిడేషన్ మంజూరైనట్లు పేర్కొన్నారు. DPRO కార్యాలయంలో పని వేళల్లో జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులను తీసుకువచ్చునని తెలిపారు. అర్హులైన వారందరికీ అక్రిడేషన్ మంజూరు చేస్తామన్నారు. వీరందరికి త్వరలో హెల్త్ చెకప్ చేయించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

News March 30, 2026

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ అధికారి రవీంద్రనాథ్‌లతో కలిసి ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.