News December 4, 2025
HYDలో యముడిని తీసుకొచ్చారు!

HYDను ‘సేఫరాబాద్’గా మార్చేందుకు ఓ ఫౌండేషన్ వినూత్న రోడ్ సేఫ్టీ క్యాంపైన్ ప్రారంభించింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు యమధర్మరాజును రంగంలోకి దించింది. రసూల్‌పురా జంక్షన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని 365 కూడళ్లలో ఏడాది పాటు కొనసాగించనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే పెద్దఎత్తున మరణాలు తగ్గుతాయన్నారు.
Similar News
News December 6, 2025
ASF: గ్రామాల్లో ఎన్నికల దావత్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ASF జిల్లా గ్రామాల్లో ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. అభ్యర్థులు తమ అనుచరులు వెంటే ఉండేందుకు ప్రతిరోజు దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. పల్లెల్లో ముక్క, చుక్కలకు కొదవ లేకుండా పోయింది. అభ్యర్థులు ఉదయం టిఫిన్లతో సహా రాత్రి దావత్ల వరకు అందిస్తున్నారు. అంతేకాకుండా, ప్రచారానికి వెళ్లే అనుచరులకు సైతం రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తుండటం గమనార్హం.
News December 6, 2025
విశాఖ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల కష్టాలు

విశాఖ విమానాశ్రయంలోనూ అయ్యప్ప స్వాములు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్న ఇండిగో సర్వీసులు శనివారం కూడా రుద్దయ్యాయి. శబరిమల వెళ్లేందుకు నగరం నుంచి చాలామంది ముందుగానే విమాన టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. దీంతో స్వాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.


