News October 27, 2025
HYDలో యాక్సిడెంట్ BLACK SPOTS..!

HYDలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ను నేషనల్ యాక్సిడెంట్ సర్వే (NAS) గుర్తించింది. బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, డైరీ ఫార్మ్, బహదూర్‌పుర, ఎంజీ మార్కెట్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల జంక్షన్లు అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలుగా నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయంది.
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎంపీ గోపూజ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం యూసుఫ్‌గూడలో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఓ నివాసంలో దూడ కనపడే సరికి వారు దానికి పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
News October 27, 2025
హైదరాబాద్ సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 12 జోన్లలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 3,500 మంది దాతలు రక్తం ఇచ్చారు. థలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల త్యాగానికి ఇది నివాళి. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని తెలిపారు. పోలీసులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు.
News October 27, 2025
FLASH: HYD: పెళ్లి కోసం చనిపోయాడు..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో ఇంట్లో వారు <<18119524>>తనకు పెళ్లి చేయడం లేదంటూ<<>> ఈరోజు ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మాధవ్ తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు కాల్ చేయాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


