News January 30, 2026

HYDలో రూ.1,000 కోట్లతో గ్రీన్ ప్లాన్!

image

పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్‌లో 10 శాతం నిధులను ‘గ్రీన్ బడ్జెట్’ కింద తప్పనిసరి చేశారు. అంటే దాదాపు రూ.1,000 కోట్లు కేవలం పార్కులు, చెరువుల పునరుద్ధరణ, మొక్కల పెంపకానికే ఖర్చు చేయనున్నారు. నగర సుందరీకరణతో పాటు ఆధునిక శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చారు. మున్సిపల్ సేవల్లో పూర్తి డిజిటల్ చెల్లింపులను అమలు చేస్తూ అవినీతికి తావు లేకుండా క్లీన్ సిటీగా మార్చడమే బడ్జెట్ లక్ష్యం.

Similar News

News February 8, 2026

HYD: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

image

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్‌తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. శంకర్‌పల్లి, షాబాద్, ఎంకేపల్లి తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు <>tgms.telangana.gov.in<<>>ను సందర్శించండి.

News February 8, 2026

JNTUHలో ‘బంగారు’తల్లి ఈమే!

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ CSE విభాగంలో అల్లంరాజు శ్రీవల్లి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. యూనివర్సిటీ నుంచి 4 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. క్యాంపస్ ప్లేస్మెంట్‌లో సైతం ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సైతం సాధించింది. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా, వారి కలలు సాకారం చేశానని తెలిపింది.

News February 8, 2026

హలీమ్ HYD ఎలా వచ్చిందంటే?

image

రంజాన్ మహినా షురూ అయిందంటే HYD షెహర్‌‌లో హలీం పరిమళాలు, దాని రుచితో మత్తెక్కిపోతుంది. పట్నంలో పొద్దుపోయినాక బట్టీల వద్ద హలీం లవర్స్ సందడి కనిపిస్తుంది. అయితే హలీమ్ అరబ్బుల వంటకం. నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, ఇక్కడ స్థిరపడిన పర్షియన్ల ద్వారా HYDకు పరిచయమైంది. 90 ఏళ్ల క్రితం పత్తర్‌గట్టిలోని మదీనా హోటల్ దీని రుచిని పట్నానికి పరిచయం చేసింది. ప్రజలు మెచ్చిన వంటకంగా 2010లో GI గుర్తింపు పొందింది.