News January 30, 2026

HYDలో రేపటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు

image

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఎయిర్ షోకు జనాలు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని HYD ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉ.7 నుంచి రాత్రి 8 వరకు పంజాగుట్ట- గ్రీన్‌ల్యాండ్స్- బేగంపేట ఎయిర్‌పోర్ట్ రూట్లో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందన్నారు. PNT ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీవో జంక్షన్ల వద్ద రద్దీకి తగ్గట్లు మళ్లింపులుంటాయన్నారు. సందర్శకులకు పార్కింగ్ ఏర్పాటు చేశారు.

Similar News

News February 12, 2026

HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

image

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.

News February 12, 2026

HYD: ఆన్‌లైన్‌‌లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

image

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT