News November 20, 2025

HYDలో రేపు జగన్ భారీ ర్యాలీ.. YSRCP నేతల ఏర్పాట్లు

image

అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు వరకు ర్యాలీగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్‌ రాకను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఉన్న YSRCP పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరుకావాలని YSRCP మిత్ర బృందం పిలుపునిచ్చింది.

Similar News

News November 20, 2025

HYD: ‘మధ్యవర్తిత్వం వద్దు.. సబ్ రిజిస్టర్‌ను కలవండి’

image

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడుల నేపథ్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన సమస్యలను, సందేహాలను కార్యాలయంలోని సబ్ రిజిస్టర్‌ను నేరుగా కలిసి నివృత్తి చేసుకునేలా నోటీసులు అంటిస్తున్నారు. గండిపేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సైతం ఈ నోటీసులు అంటించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 20, 2025

హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన KTR‌: సబిత

image

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం CM రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా-ఈ రేసులను నిర్వహించి హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన KTR‌పై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.

News November 20, 2025

HYD: ఫేక్ ఎన్‌కౌంటర్లను పూర్తిగా ఖండిస్తున్నాం: టీపీసీసీ చీఫ్

image

మావోయిస్టుల ఫేక్ ఎన్‌కౌంటర్లను పూర్తిగా ఖండిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం HYD ముగ్దుం భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ‘కగార్‌పై మాట్లాడితే దేశ ద్రోహి ముద్ర వేశారు.. ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని సర్వం కోల్పోయిన వారు చెబుతుంటే కక్ష్య పూరితంగా అంతమొందిస్తున్నారు.. హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదు’ అని ఆయన పేర్కొన్నారు.