News April 6, 2025

HYDలో రేపు మొత్తం వైన్స్ బంద్..!

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని HYD నగరంలోని ట్రై కమిషనరేట్లు HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటాయని అధికారులు తెలిపారు. రాచకొండ పోలీసులు నిన్ననే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా HYD, సైబరాబాద్ పోలీసులు సైతం వెల్లడించారు. కల్లు దుకాణాలు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటల్లు, రిజిస్టర్ క్లబ్లలోనూ బంద్ ఉంటాయన్నారు

Similar News

News April 6, 2025

ఆ పాత్ర కోసం 10 కేజీల బరువు తగ్గా: విజయశాంతి

image

‘అర్జున్ S/O వైజయంతి’ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం 10KGల బరువు తగ్గినట్లు విజయశాంతి చెప్పారు. నాన్‌వెజ్ మానేసి స్పెషల్ డైట్, వర్కవుట్లు చేసినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పోలీస్ పాత్ర అనగానే కర్తవ్యం, వైజయంతి సినిమాలు గుర్తుకొస్తాయి. అప్పటి లుక్‌తో పోల్చుతారు. అందుకే కష్టమైనా సరే బరువు తగ్గా’ అని వివరించారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

News April 6, 2025

విషాదం.. నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి

image

AP: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అవనిగడ్డ మండలం కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు చనిపోయారు. మృతులను మోదుమూడి గ్రామానికి చెందిన మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15)గా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News April 6, 2025

CPM ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన MA బేబీ

image

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా MA బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులో నిర్వహిస్తున్న పార్టీ మహాసభల్లో నేతలంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశలో కేరళ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరికతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బేబీ 1986 నుంచి 1998 వరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేరళ మంత్రిగానూ సేవలందించారు. సీతారాం ఏచూరి మరణంతో ఇంతకాలం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది.

error: Content is protected !!