News October 11, 2025
HYDలో రోజుకు ఐదుగురి ప్రాణాలు పోతున్నాయ్..!

HYDలో రోజుకు 31 చొప్పున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజు కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మృతుల్లో ఎక్కువగా బైకర్లు, పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ORRపై 2024లో జరిగిన ప్రమాదాల్లో రాచకొండ పరిధిలో 19 మంది, సైబరాబాద్ పరిధిలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News October 11, 2025
సీఐతో వాగ్వాదం.. పేర్ని నానిపై కేసు

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి PSలో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. కాగా ఓ కేసులో వైసీపీ నేత సుబ్బన్నను విచారణకు పిలవడంతో వివాదం రాజుకుంది. పేర్ని నాని వచ్చి సీఐతో <<17968702>>వాగ్వాదానికి<<>> దిగారు.
News October 11, 2025
యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 5 యంగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 22లోపు అప్లై చేసుకోగలరు. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21నుంచి 35ఏళ్లు. నెలకు రూ.40వేలు జీతంగా చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/
News October 11, 2025
RR: పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి: DMHO

రంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి తెలిపారు. పట్టణ ప్రాంతంలో 1,99,967 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 2,20,944 మంది చిన్నారులు ఉన్నారని, 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె పేర్కొన్నారు.