News August 18, 2025
HYDలో లక్ష దాటింది!

వినాయకచవితి వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. మండపాల వద్ద, నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సూచనలు, సలహాలు ఇస్తోంది. ఈ సంవత్సరం గ్రేటర్ వ్యాప్తంగా లక్షా 40వేల విగ్రహాలకు పైగా ప్రతిష్ఠించే అవకాశముందని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు.
Similar News
News August 18, 2025
20 ఏళ్లు వేచిన ఉస్మానియాకు CM

తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకొన్న ఉస్మానియాకు 20 ఏళ్ల తర్వాత ఓ CM వస్తున్నారు. సమైఖ్య పాలనలో 9 ఏళ్లు, స్వరాష్ట్రం ఏర్పాటైన 11 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఎవరూ రాలేదన్న విమర్శలున్నాయి. తాజాగా OU VC రేవంత్‌ను క్యాంపస్‌కు ఆహ్వానించారు. CM ఓకే అనడంతో AUG 21న షెడ్యూల్ ఖరారైంది. హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం, డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన చేస్తారు. విద్యార్థులతో CM సంభాషణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
News August 18, 2025
HYD: తెలుగు మీడియం.. ఇంగ్లిష్‌లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VCకి ఓ విద్యార్థిని వినూత్న విన్నపం పంపింది. హయత్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఎంఏ (ఎకనామిక్స్) అడ్మిషన్ తెలుగు మీడియంలో తీసుకుంది. ఇటీవల జరిగిన పరీక్షలో సమాధానాలను ఆమె తెలుగులో కాకుండా ఇంగ్లిషులో రాసింది. సిలబస్ ప్రకారమే తాను పరీక్ష రాశానని, తెలుగులో కాకుండా ఇంగ్లిష్ రాశానని, తన పేపరును వాల్యూయేషన్ చేయాలని వీసీని ట్విట్టర్లో కోరింది.
News August 18, 2025
HYD: జలకళ.. సిటీకి బేఫికర్

ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల వల్ల నగరవాసి తాగునీటికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చే సంవత్సరం వేసవికాలం వరకు నీటి సమస్య ఉత్పన్నం కాదు. సిటీకి తాగునీటిని సరఫరా చేసే నాగార్జునసాగర్, మంజీరా, శ్రీపాద ఎల్లమ్మ, సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు నీటితో కళకళలాడుతూ ఉండటంతో జలమండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.