News January 21, 2026

HYDలో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

image

ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ లారియల్(L’Oréal) HYDలో తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ CEO నికోలస్ సమావేశమై చర్చించారు. నవంబర్‌లో జరిగే ప్రారంభోత్సవానికి CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. ఆవిష్కరణలు, టెక్నాలజీ, Ai డేటాకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ఆసక్తి చూపింది.

Similar News

News March 29, 2026

SRH ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్‌కు గాయం

image

SRH బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్(ఇంగ్లండ్) గాయపడినట్లు హెడ్ కోచ్ వెటోరీ వెల్లడించారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి ఆయన చేతికి బలంగా తాకడంతో వాపు వచ్చిందన్నారు. RCBతో మ్యాచులో ఆడటానికి ట్రై చేసినప్పటికీ సాధ్యం కాలేదని చెప్పారు. ప్రస్తుతం బ్రైడన్ కోలుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 2న KKRతో మ్యాచుకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 29, 2026

‘బాహుబలి-2’ రికార్డు బద్దలైంది

image

నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ‘ధురంధర్2′($21M+) నిలిచింది. 9 ఏళ్లుగా ‘బాహుబలి2′($20.78M) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. దీనిపై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘మూవీ చూశా. నాకు నచ్చింది. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. కాగా ‘ధురంధర్2’ 10 రోజుల్లో ₹1,226Cr+ వసూళ్లు సాధించింది.

News March 29, 2026

వేసవిలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే

image

అధిక వేడి, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘శరీరంలో నీటి శాతం తగ్గితే కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గి సరిగా పనిచేయవు. హైడ్రేషన్ కోసం మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ, ద్రాక్ష, దోస, సొరకాయ వంటివి తీసుకోవాలి. 12pm-3pm మధ్య బయట తిరగొద్దు. బయట పనిచేసేవారు 20minకోసారి గ్లాస్ వాటర్ తాగాలి. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే అది డీహైడ్రేషన్‌కు సంకేతం’ అని చెబుతున్నారు.