News August 10, 2025
HYDలో వర్షం ఎఫెక్ట్.. పలు విమానాలకు అంతరాయం

సాంకేతిక సమస్యలు, వాతావరణ ప్రతికూలత వల్ల నిన్న పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలిగింది. అహ్మదాబాద్ నుంచి HYDకు వచ్చే విమానం 5 గంటలు ఆలస్యంగా వచ్చింది. శంషాబాద్- సాయంత్రం రస్‌అల్‌ఖైమానా బయలుదేరాల్సిన విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. భారీ వర్షం కారణంగా షార్జా వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా టేకాఫ్‌తీసుకుంది. మరో 2 దేశీయ విమానాలు గంట ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి.
Similar News
News August 10, 2025
HYD: గ్యాస్ సబ్సిడీ రాట్లే సార్.. ఏం చేయాలి?

రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపింది. కానీ.. గ్రేటర్ వ్యాప్తంగా లక్షల్లో లబ్ధిదారులు అర్హులైనప్పటికీ తమకు సబ్సిడీ అందటం లేదని, GHMC కార్యాలయాల వద్ద అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ప్రజాపాలనలో తాము దరఖాస్తు చేసుకున్నామని, 200 యూనిట్ల ఉచిత కరెంటు వస్తున్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ రావడం లేదని ఉప్పల్ GHMC ఆఫీస్ వద్ద పలువురు వాపోయారు. మీకు సబ్సిడీ రావడంలేదా? కామెంట్ చేయండి.
News August 10, 2025
‘రాఖీ’ రోజే సోదరిని కోల్పోయిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి నాడే ఇబ్రహీంపట్నం MLA ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం తన సోదరి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగేటి భూదేవి నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ రోజు వారి స్వగ్రామం తొర్రూరులో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
News August 10, 2025
HYD- నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్‌కు ఆదరణ అంతంతే!

కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన HYD- నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్‌కు ఆదరణ అంతంత మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి 19న ఈ ట్రైన్‌ను 20 కోచ్‌లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కోచ్‌ల సంఖ్య ఒక్కసారిగా 8కి తగ్గించారు. అయినా ఆక్యుపెన్సీ రేషియో 70% మాత్రమే ఉంది. డిమాండ్‌లేని ఈ రూట్‌లో ట్రైన్ ప్రారంభించడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు.