News September 19, 2025
HYDలో వర్షపాతం వివరాలు ఇలా!

HYDలో నిన్న పలుచోట్ల వర్షం పడింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బహదూర్‌పురాలో 9.1 CM, నాంపల్లిలో 8, చార్మినార్‌లో 7.8, కాప్రాలో 6.2, ఖైరతాబాద్‌లో 5.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న చాలా చోట్ల సాయంత్రం 2 గంటల పాటు వర్షం కురిసింది. అర్ధరాత్రి దాటాక మరోసారి దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు, పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.
Similar News
News September 19, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.
News September 19, 2025
కోకాపేట్‌లో భర్తను చంపిన భార్య

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.