News March 26, 2025
HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేరు వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్శిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండ యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.
Similar News
News March 26, 2025
మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.
News March 26, 2025
ధర్మారం: మద్యానికి బానిసై యువకుడి సూసైడ్

మద్యానికి బానిసై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన నవీన్ (29) మద్యానికి బాగా బానిసయ్యాడు. దీంతో అతడి భార్య తనను వదిలివెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
News March 26, 2025
వేసవిలో చర్మం రంగు మారుతుందా?

వేసవిలో ఎండకు చర్మం రంగు నల్లగా మారుతుంది. UV కిరణాలకు గురికావడం టానింగ్‌కు కారణమవుతుంది. దీనిని నివారించేందుకు ఫుల్ స్లీవ్ గ్లౌజులు ధరించడం ఉత్తమం. కలబంద జెల్‌ను ముఖం, చేతులు, మెడపై అప్లై చేయడం ప్రయోజనకరం. వీటితో పాటు చర్మాన్ని బట్టి ఇంట్లో ఉండే శనగపిండి, పసుపు, పాలు, తేనె, రోజ్ వాటర్, ముల్తాన్ మట్టితో ఫేస్‌ప్యాక్ చేసుకొని ముఖం, చేతులు, మెడకు అప్లై చేసుకోవచ్చు.