News October 11, 2025
HYDలో వేసవి విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలు

HYDలో ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలకు ఉపక్రమించినట్లుగా TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు రెండు రోజులు వర్చువల్, ఆన్ ఆఫీస్ పద్ధతిలో సర్కిల్ స్థాయిలోని అధికారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేశారు. ఇప్పటి నుంచి ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఈసారి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Similar News
News October 11, 2025
విశాఖ జిల్లాలో 1,000 మంది బాలురకు 969 మంది బాలికలు

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా DMHO కార్యాలయం నుంచి శనివారం ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు ర్యాలీని ప్రారంభించారు. బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లాలో ప్రతి 1,000 మంది బాలురకు 969 మంది బాలికలు ఉన్నారని, ఈ నిష్పత్తి సమానంగా ఉండేలా చూడాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలన్నీ లింగ నిర్దారణ పరీక్షలు చేయకూడదన్నారు.
News October 11, 2025
యథాతధంగా PGRS కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్‌ఎస్ (PGRS) కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. ప్రజలు తమ డివిజన్/మండల కేంద్రంలో, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్జీలు అందజేసి సమస్య పరిష్కారం పొందాలన్నారు. అర్జీలను 1100 నంబర్, లేదా meekosam.ap.gov.in ద్వారా కూడా తెలియజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News October 11, 2025
భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్

ఫిలిప్పీన్స్‌లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2025 పోటీల్లో INDకి చెందిన షెర్రీసింగ్ విజయం సాధించారు. ఈ పేజెంట్‌లో మన దేశానికి తొలికిరీటం తెచ్చి షెర్రీ చరిత్ర సృష్టించారు. నోయిడాలో జన్మించిన షెర్రీ ఫ్యాషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్, మెంటల్ హెల్త్‌పై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ‘ఈ విజయం నాది మాత్రమే కాదు. కలలు కనే ధైర్యం చేసిన ప్రతి స్త్రీకి చెందుతుంది.’ అని షెర్రీ అన్నారు.