News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News March 4, 2025
మేలో ‘ఎల్లమ్మ’ షూటింగ్!

‘బలగం’తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు తెరకెక్కించే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన వేణు.. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైకి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
News March 4, 2025
రోహిత్ ఈ సారైనా టాస్ గెలువు: ఆకాశ్ చోప్రా

రోహిత్‌శర్మ ఈసారైనా టాస్ గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోరారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ పాత్ర కీలకం కానుందని తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. ఈ పిచ్‌లపై ఛేజింగ్ చాలా కష్టమని, సెమీస్‌లో టాస్ గెలవటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడినప్పటికీ మ్యాచులలో గెలిచింది. అయితే రోహిత్ శర్మ వరుసగా 10సార్లు టాస్ ఓడి రికార్డు సృష్టించారు.
News March 4, 2025
దిశvsశక్తి.. మండలిలో వాడీవేడీ చర్చ

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను తొలగించడంపై మండలిలో YCP MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు సవిత, అనిత కౌంటరిచ్చారు. చట్టబద్ధత లేని దిశ గురించి ఆమె మాట్లాడుతున్నారని, ఆ యాప్‌తో ఎంతమంది మహిళలను రక్షించారని ప్రశ్నించారు. తాము నెట్‌వర్క్ లేని చోట కూడా పనిచేసేలా శక్తి యాప్‌ను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తామని తెలిపారు.