News December 15, 2025
HYDలో సరికొత్త చాట్ కోడ్..!

HYD యువత ఇప్పుడు ఇంగ్లిష్, తెలుగు, దఖిని (Dakhni) పదాలతో ‘హైబ్రిడ్-హింగ్లిష్’ భాషా విప్లవాన్ని సృష్టిస్తున్నారు. బైగన్ (పనికిరాని), క్యా యార్ (ఏంటిరా), ఖాళీ-పీళీ(అనవసరంగా) వంటి పదాలు ఇందులో కీలకం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్థానిక గుర్తింపును చాటుకుంటున్నారు. అందరికీ అర్థంకాని ఈ భాష, కొత్త మీమ్స్ ద్వారా రోజురోజుకూ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాపార్డర్ భాషగా దూసుకుపోతోందని తెలుసా!
Similar News
News March 3, 2026
హుస్సేన్‌సాగర్‌కు కొత్త కళ

ట్యాంక్‌బండ్ తీరానికి కొత్త కళ రాబోతోంది. బుద్ధభవన్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల విస్తరణకు HMDA రూ.3.16 కోట్లతో పనులు చేపట్టనుంది. PVNR మార్గ్ వెంబడి తీరాన్ని పటిష్ఠం చేస్తూ రివెట్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. పనుల్లో భాగంగా 5,424 చదరపు మీటర్ల మేర అందమైన పెయింటింగ్స్‌తో గోడలను తీర్చిదిద్దనున్నారు. నాలుగేళ్ల గడువులోగా ఈ సుందరీకరణ పనులు పూర్తి చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది.
News March 3, 2026
మెట్రో ఫేజ్-2 వారసత్వ కట్టడాల సవాలు

HYD మెట్రో ఫేజ్-2 విస్తరణలో పాతబస్తీ కారిడార్ ఇప్పుడు అధికారులకు పరీక్షగా మారింది. వారసత్వ కట్టడాల రక్షణపై హైకోర్టు నిబంధనలు కఠినంగా ఉండటంతో అలైన్‌మెంట్‌లో సాంకేతిక మార్పులు తప్పనిసరయ్యాయి. అటు L అండ్ T నుంచి ప్రాజెక్టు బాధ్యతల బదిలీపై ప్రభుత్వ కసరత్తు సాగుతుండగా ₹42,000 కోట్ల భారీ వ్యయంలో కేంద్రం 20% వాటాపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాఫిక్ డెన్సిటీ అంచనాలపై కేంద్రం కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం.
News March 3, 2026
HYD: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే.. రంగుపడుద్ది

హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


