News December 15, 2025
HYDలో సరికొత్త చాట్ కోడ్..!

HYD యువత ఇప్పుడు ఇంగ్లిష్, తెలుగు, దఖిని (Dakhni) పదాలతో ‘హైబ్రిడ్-హింగ్లిష్’ భాషా విప్లవాన్ని సృష్టిస్తున్నారు. బైగన్ (పనికిరాని), క్యా యార్ (ఏంటిరా), ఖాళీ-పీళీ(అనవసరంగా) వంటి పదాలు ఇందులో కీలకం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్థానిక గుర్తింపును చాటుకుంటున్నారు. అందరికీ అర్థంకాని ఈ భాష, కొత్త మీమ్స్ ద్వారా రోజురోజుకూ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాపార్డర్ భాషగా దూసుకుపోతోందని తెలుసా!
Similar News
News December 16, 2025
ప.గో: ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి సందడి తెచ్చేసింది..!

ధనుర్మాసం వచ్చేసింది. మంచు తెరలు గోదారి అలలను ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. బరిలోకి కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సై అంటుంటే, అత్తారింటికి రావడానికి కొత్త అల్లుళ్లు ఎదురు చూస్తున్నారు. సిటీల్లో ఉన్నా సరే, మనసుని లాగేసే గోదారి మట్టి వాసన, అమ్మమ్మ గారి ఊరి జ్ఞాపకాలు సంక్రాంతి ప్రత్యేకత. ఇది కేవలం పండగ కాదు.. గోదారోడి గతాన్ని, వర్తమానాన్ని ముడివేసే ఒక తీయని అనుభూతి.
News December 16, 2025
MP బైరెడ్డి శబరి ఇంట్లో మంత్రి లోకేశ్

న్యూఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ టీడీపీ పార్లమెంట్ సభ్యులతో నంద్యాల MP డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఎంపీ శబరి ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆమె ఇంటికి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు TDP ఎంపీలు హాజరయ్యారు. మంత్రి లోకేశ్‌కు, తనతోటి ఎంపీలకు భోజనాల ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని శబరి తెలిపారు.
News December 16, 2025
ధనుర్మాసంలో శ్రీవ్రతం ఆచరిస్తే..?

నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ పుణ్య కాలంలో శ్రీవ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. విష్ణువును మధుసూధనుడిగా పూజించి గోదాదేవి కీర్తనలు ఆలపిస్తారు. ఫలితంగా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు కృష్ణుడికి తులసి మాల సమర్పిస్తే నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందని సూచిస్తున్నారు. ☞ శ్రీవ్రతం ఎలా చేయాలి? గోదాదేవి కీర్తనల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


