News November 12, 2024
HYDలో సెక్షన్ 163 పరిధి కుదింపు
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న నుంచి HYD, SEC వ్యాప్తంగా BNSS 163 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సచివాలయ పరిధిలో 500 మీటర్ల వరకే BNSS 163(144 సెక్షన్) అమలులో ఉంటుందని పేర్కొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీల నిషేధం అమలు కానుంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా, ర్యాలీలకు అనుమతించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News November 13, 2024
ఓయూలో త్వరలో సంస్కరణలు: వీసీ
తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు వీసీ ప్రొ.ఎం.కుమార్ వెల్లడించారు. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ హాజరు తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. VC బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఠాగూర్ ఆడిటోరియంలో అధ్యాపకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న న్యాక్ గుర్తింపులో ఉత్తమ రేటింగ్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
News November 13, 2024
RR: ప్రతి గ్రామంలో విత్తనోత్పత్తికి రంగం సిద్ధం..!
గ్రామాల్లో విత్తనోత్పత్తికి రంగం సిద్ధమైంది. RR,MDCL,VKB జిల్లాల్లో వచ్చే ఏడాది వానకాలం నుంచి ప్రతి గ్రామంలో 5-10 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేలా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు, విత్తన విభాగాన్ని ఏర్పాటు చేసి, వర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన విత్తనాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులు పండించిన పంట నుంచి విత్తనాలను ఉత్పత్తి చేస్తారు.
News November 13, 2024
HYD: ప్రజా కవికి 1992లోనే పద్మవిభూషణ్: KTR
ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, MLA KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1992లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.