News November 12, 2024

HYDలో సెక్షన్ 163 పరిధి కుదింపు

image

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న నుంచి HYD, SEC వ్యాప్తంగా BNSS 163 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సచివాలయ పరిధిలో 500 మీటర్ల వరకే BNSS 163(144 సెక్షన్‌) అమలులో ఉంటుందని పేర్కొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీ‌ల నిషేధం అమలు కానుంది. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా, ర్యాలీలకు అనుమతించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.

Similar News

News July 9, 2025

MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.

News July 9, 2025

ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

News July 9, 2025

ఘట్కేసర్ వాసుకి ఉత్కృష్ట సేవా పథకం

image

కేంద్ర ప్రభుత్వ ఉత్కృష్ట సేవా పతకం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన గుండ్యా నాయక్‌ను వరించింది. విధి నిర్వహణలో 15 ఏళ్ల పాటు సేవ, అంకితభావంతో వృత్తి పరమైన నైపుణ్యంతో అనేక విజయాలు సాధించిన ఆయనను ఉత్కృష్ట సేవా పతకం 2025 వరించింది. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.