News February 1, 2025
HYDలో హృదయవిదారక ఘటన
HYDలోని వారాసిగూడ PSపరిధిలో ఇంట్లో <<15323241>>తల్లి మృతదేహంతో ఇద్దరు కూతుర్లు<<>> ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.
Similar News
News February 1, 2025
BUDGET: మెడిసిన్ ఆశావహులకు స్వీట్ న్యూస్
మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75000 పెంచుతామని తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇక యువత కోసం దేశవ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఆరంభిస్తామన్నారు. రూ.500 కోట్లతో విద్యలో AI ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.
News February 1, 2025
BUDGET 2025-26: ముఖ్యాంశాలు
*గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు
*అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం
*MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్
*నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ.10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
*నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు
*సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
*ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు
News February 1, 2025
BUDGET 2025: రైతులకు మరో గుడ్‌న్యూస్
రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ.5Lకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులు, జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై మాట్లాడారు.