News January 3, 2026
HYDలో హై రైజ్ బిల్డింగ్స్ అదరహో..!

HYD నగరంలో గ్రేటర్ వ్యాప్తంగా హై రైజ్ భవనాలు వేగంగా పెరుగుతున్నాయి. 2024లో 69 హై రైజ్ భవనాలకు అనుమతులు మంజూరు కాగా, 2025లో 103 హై రైజ్ భవనాల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల పరంగా 2024లో 11,855 భవనాలకు, 2025లో 11,166 భవనాలకు అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News January 5, 2026
US వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ఒహియోలోని ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫైరింగ్ సమయంలో వాన్స్ ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
మహిళలూ 35ఏళ్లు దాటాయా?

35ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ, ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. ఇదే ఆస్టియొపొరోసిస్. ఇలా కాకుండా ఉండాలంటే 35 ఏళ్ల వరకూ ప్రతిరోజూ పావు లీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెనోపాజ్ వరకూ ఎముకల అరుగుదలను నియంత్రించవచ్చు. ఆ తర్వాత క్యాల్షియం సప్లిమెంట్ల అవసరం రావొచ్చు. అప్పుడు కూడా సొంతంగా సప్లిమెంట్లు కొనేసి వాడేయకుండా, వైద్యుల సూచనలను పాటించాలి.
News January 5, 2026
తిరుపతి: సంక్రాంతికి ధర.. రూ.10 వేలు పైనే.!

సంక్రాంతి నేపథ్యంలో తిరుపతిలో ట్రావెల్స్ యజమానులు ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా HYD-TPT మధ్య బస్సు స్లీపర్ ధర రూ.వెయ్యి-1500 ఉంటుంది. 11,12,13 తేదీల్లో ధరలు రూ.2వేల పైమాటే. సంక్రాంతి దగ్గరకొచ్చే కొద్ది రూ.5వేలకు చేరిన ఆశ్చర్యం లేదు. మరోవైపు HYD-TPT మధ్య ఫ్లైట్ ధరలు నార్మల్ డేస్‌లో రూ.3700-4500 మధ్య ఉండగా 10వ తేదీ రూ.8-10వేల మధ్య ఉంటున్నాయి. దీంతో పండుక్కు వెళ్లకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయట.


