News April 20, 2025

HYDలో 2 దశాబ్దాల తర్వాత పోరు!

image

HYD స్థానిక కోటా MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత 22 ఏళ్లుగా ఈ స్థానం ఏకగ్రీవమే. ఈ సారి పోటీకి BJP సిద్ధమవడం విశేషం. ఈ కోటాలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. INC ఎన్నికకు దూరం ఉండగా.. BRS ఏకంగా పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23న MIMతో BJP పోటీ పడుతోంది.

Similar News

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.

News September 3, 2025

జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్

image

జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.