News January 9, 2026
HYDలో 2 రోజులు వాటర్ బంద్

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
Similar News
News January 12, 2026
నేటి ముఖ్యాంశాలు

✹ ఇండియా ధైర్యానికి సజీవ సాక్ష్యమే సోమనాథ్: మోదీ
✹ AP: రూ.1750 కోట్లతో NTR విగ్రహం: నారాయణ
✹ గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల
✹ TG: ధరణి లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్: పొంగులేటి
✹ సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు
✹ న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో భారత్ విజయం
News January 12, 2026
ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్‌కు రెండో విజయం.
News January 12, 2026
అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.


