News August 20, 2025
HYDలో 24Hrs బస్సులకు పాజిటివ్ రెస్పాన్స్

HYDలో <<17459238>>24Hrs బస్సులు<<>> నడపాలని పలువురు కోరడంతో ఉదయం Way2News వార్త పబ్లిష్ చేసింది. దీనికి మెజార్టీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. లాస్ లేకుండా కొన్ని రూట్లలో నడపొచ్చని, ఉ.4 నుంచి రాత్రి ఒంటి గంటవరకు, మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ సేవలు అవసరమని, పటాన్‌చెరు- సికింద్రాబాద్ నైట్ టైమ్ బస్సులు కావాలని, కనీసం గంటకో బస్ అయినా.. అంటూ కామెంట్లు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని పలువురు కోరారు.
Similar News
News August 20, 2025
HYD: హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారు: సీఎం

హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో మాట్లాడుతూ.. నగరం సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోందని, మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చామని, రాబోయే పదేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుతామన్నారు.
News August 20, 2025
HYD: ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త: DCP

HYD నగర భవన యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు. నివాస, వాణిజ్య భవనాలను నగరంలో రెంట్ కోసం ఇచ్చే ముందు యజమానులు నిబంధనలు పాటించాలని, అగ్రిమెంట్ చేసుకోవాలని సైబర్‌క్రైమ్ DCP శిల్పవల్లి తెలిపారు. ఖాళీ చేయించాల్సిన సమయంలో రెంటర్లకు నోటీసులు ఇవ్వాలని, కిరాయి సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవాలని సూచించారు.
News August 20, 2025
మలేరియాకు మూలాన్ని కనిపెట్టింది సికింద్రాబాద్‌లోనే

సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో పని చేసే బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1997 ఆగస్టు 20న మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని నిరూపించారు. పరిశోధనతో ఆయనను 1902లో నోబెల్ అవార్డు వరించింది. దానికి గుర్తుగా ఈ రోజును ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు. నేటికి ఈ ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ చరిత్రను నెమరేసుకుంటున్నారు.