News October 10, 2025
HYDలో 265 ఎలక్ట్రిక్ బస్సులు..TARGET 2,000

గ్రేటర్ HYDలో ఇప్పటి వరకు 265 ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మరోవైపు వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తుంది. 2027 నాటికి దశల వారీగా 2000 పైగా బస్సులు హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీనగర్, హైటెక్ సిటీ సహా అనేక మార్గాలలో ఎలక్ట్రిసిటీ బస్సులు నడిపిస్తుంది.
Similar News
News October 10, 2025
HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్..15,641 కేసులు నమోదు

సైబరాబాద్ పోలీసులు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై 15,641 కేసులు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు రూ.72,02,900 జరిమాణాలు విధించినట్లు వెల్లడించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎదుటివారి ప్రాణాలకు ముప్పు అని తెలిపారు.
News October 10, 2025
OU: డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు అధికారులు తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 14వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News October 10, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి కోసం WAITING

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులు ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంకా వెనుకంజలో ఉంది. పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. 3, 4 పేర్లను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపించింది. 2, 3 రోజుల్లో పార్టీ క్యాండిడేట్ ఎవరనేది ప్రకటిస్తామని బీజేపీ TG చీఫ్ రామచందర్ రావు తెలిపారు. కాగా కార్యకర్తల్లో అభ్యర్థి ఎవరనే టెన్షన్, ఉత్సాహం నెలకొంది.