News March 28, 2025

HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

image

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.

Similar News

News November 7, 2025

నరసరావుపేట: వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. సహజ సౌందర్యం నడుమ అధికారులు ఆనందంగా గడిపారు.

News November 7, 2025

ఆసిఫాబాద్: ‘పెండింగ్ సమస్యలను పరిష్కరించండి’

image

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆసిఫాబాద్‌లో ఈరోజు ఏటీడీవో శివకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

News November 7, 2025

వాలీబాల్ జట్టుకు ఎంపికైన ములుగు జిల్లా క్రీడాకారులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ జట్టుకు ములుగు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరగనున్న తెలంగాణా సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ములుగు జిల్లా వాలీబాల్ క్రీడాకారులు.. నాలి తరుణ్, కొమరం ఉదయ్, గొంది వసంత్, సోయం నర్సింహ, కొమరం సునీల్, శివ, నరేందర్ ఎంపికయ్యారు.