News August 14, 2025

HYDలో 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి: కలెక్టర్

image

భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నట్లు HYD కలెక్టర్ హరిచందన తెలిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, హైదరాబాద్ జిల్లాలో 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఆఫీసుల్లో నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు వచ్చి ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడొద్దని సూచించారు.

Similar News

News August 14, 2025

జిల్లాలో పెరిగిన భూగర్భ జల నీటిమట్టం: కలెక్టర్

image

గతేడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో భూగర్భ జలమట్టం సగటున 2.26 మీటర్ల మేర పెరిగిందని కలెక్టర్ పి.అరుణ్ బాబు సీఎం చంద్రబాబుకు వివరించారు. సాగునీటి సబ్‌మెగా సభ్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ సాగర్ ఛైర్మన్ కాంతారావుతో కలిసి పాల్గొన్నారు. భారీగా చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణాల కారణంగా వచ్చే ఏడాదికీ జలమట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

News August 14, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సిద్దిపేట ఈడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణరావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతో లక్ష రూపాయల విలువైన షూలు, ఐడి కార్డులు, బెల్టులు వంటి అందజేశారు.

News August 14, 2025

UPIలో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.