News December 12, 2024

HYDలో 84,000 ఇందిరమ్మ ఇళ్లు!

image

HYDలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. లబ్ధిదారుల వివరాలు పరిశీలించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించింది. HYD‌లో 5,00,822, మేడ్చల్‌లో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, పటాన్‌చెరు నియోజవకర్గంలో 20,711, కంటోన్మెంట్‌లో 29,909 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్‌లో 84,000 ఇళ్లు నిర్మించాలి.

Similar News

News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.

News December 26, 2025

HYD: మహానగరంలో 311 గ్రామాలు..!

image

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన నోటిఫికేషన్ రావడంతో గ్రేటర్ స్వరూపమే మారిపోయింది. శివారు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు GHMCలో కలవడంతో 2053 చదరపు కి.మీ విస్తీర్ణం పెరిగింది. ఇపుడు మహానగరంలో 311 గ్రామాలు, 47 మండలాలు, ఐదు జిల్లాలు భాగమయ్యాయి. ఆరు పార్లమెంటు స్థానాలు ఉండగా 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

News December 26, 2025

HYD: దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించిన భర్త

image

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాలు.. భార్యపై అనుమానంతో వెంకటేశ్ తన భార్య త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని ఇంటి బయటకు తీసుకెళ్లి త్రివేణిని దహనం చేసి వెంకటేశ్ పరారయ్యాడు. మంటల్లో త్రివేణి దహనం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలింపు చేపట్టారు.