News October 6, 2025

HYDలో 95% పెరిగిన బిల్టప్ ఏరియా

image

గత 30 ఏళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణాల విస్తీర్ణం రెట్టింపైందని ‘సిటీస్ ఇన్ మోషన్’‌లో స్వైర్ యార్డ్ సంస్థ వెల్లడించింది. 8 ప్రధాన నగరాల్లో బిల్టప్ ఏరియా మొత్తం 4,308 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఇది 98% పెరుగుదలగా పేర్కొంది. HYDలో ప్రస్తుతం బిల్టప్ ఏరియా 519 చ.కి.మీ.గా ఉండగా, 1995లో 267 చ.కి.మీ. మాత్రమే ఉండేది. ఈ మధ్యకాలంలో 252 చ.కి.మీ. పెరిగి, 95% వృద్ధి నమోదైంది.

Similar News

News October 6, 2025

HYD: తూచ్.. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేయలేదు..!

image

తూచ్.. అసలు బదిలీ క్యాన్సల్ అన్నట్లు ఉంది వ్యవహారం. నిన్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ అనంతరం అక్కడ సైదులును నియమిస్తూ పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 గంటల తర్వాత నోటిఫికేషన్‌లో మార్పు చేస్తూ యధావిధిగా వెంకటేశ్వర రెడ్డిని కొనసాగించింది. ఎస్‌బీకి సైదులును ట్రాన్స్‌ఫర్ చేశారు.

News October 6, 2025

HYD: పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

image

HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పీజీ (రెగ్యులర్, ప్రత్యేక కోటా), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు దాఖలు చేసుకునే గడువుని పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch.విద్యాసాగర్ ఈరోజు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈనెల 12వ తేదీ సా.5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

News October 6, 2025

HYD: అవసరమైన సమాచారం వెంటనే అందించాలి: డిప్యూటీ కమిషనర్

image

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని 179 మద్యం దుకాణాల దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం వెంటనే అందించాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి ఈరోజు ఆదేశించారు. అబ్కారీ భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో 11 ఎక్సైజ్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దరఖాస్తులు నింపడంలో దరఖాస్తుదారులకు సహకారం అందించి, ఎటువంటి తప్పిదాలు లేకుండా చూడాలని సూచించారు.