News September 17, 2025
HYDలో BRS అధికారంలోకి రావాలని భావిస్తున్నారు: KTR

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఘన విజయం సాధిస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారన్నారు. HYD అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ BRS అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారన్నారు.
Similar News
News September 17, 2025
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: GWL కలెక్టర్

జోగులాంబ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. ఈ నెలలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.
News September 17, 2025
ICC ర్యాంకింగ్స్.. టీమ్ ఇండియా హవా

ICC తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా సత్తా చాటింది. వన్డే, T20 ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచింది. No.1 వన్డే బ్యాటర్‌గా గిల్, No.1 T20 బ్యాటర్‌గా అభిషేక్, No.1 టెస్ట్ బౌలర్‌గా బుమ్రా, No.1 T20 బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి, No.1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా జడేజా, No.1 టీ20 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ నిలిచారు. అటు స్మృతి మంధాన ఉమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరారు.