News August 22, 2025
HYDలో ‘Go Back’ స్లోగన్స్.. మీ కామెంట్?

HYD వేదికగా ‘మార్వాడీ గో బ్యాక్’ స్లోగన్స్ చేస్తూ.. నేడు TG బంద్‌కు OU JAC పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. మరో ఉద్యమం మొదలైందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదానికి INC, BJP దూరంగా ఉన్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా సిటీలో మార్వాడీలు స్థిరపడ్డారని, కలిసి మెలిసి ఉంటున్న సమయంలో కొత్తగా ఆందోళన ఏంటని కొందరు పెదవి విరిస్తున్నారు. మరి ‘గో బ్యాక్’ నినాదంపై మీ కామెంట్?
Similar News
News March 26, 2026
HYD: యువతికి BAD మెసేజ్ చేసింది ఇతడే!

కొండాపూర్‌కు చెందిన యువతికి అసభ్యకర సందేశం పంపిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న SMలో ఆమె ఫిర్యాదు చేయగా కొండాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకొన్నట్లు బాధితురాలికి వాట్సాప్‌లో <<19475160>>లైవ్ ఫొటో<<>> పంపారు. కేవలం గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకొన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, వేధింపులకు పాల్పడితే కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు.
News March 26, 2026
బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం: ఎస్పీ

యువత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జూదం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తమ విలువైన సమయాన్ని విద్య, ఉపాధి లక్ష్యాల కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.
News March 26, 2026
ఆదిలాబాద్ జిల్లాలో 21 వేల విత్తన కిట్ల పంపిణీ: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 21,000 విత్తన కిట్లను పంపిణీ చేస్తున్నామని, ఒక్కో కిట్ విలువ సుమారు రూ.500 ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. భూమి లేని వారు తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నానో యూరియాను వినియోగించాలని సూచించారు.


